1 నుండి 5వ తరగతికి ఎలా బోధన చెయ్యాలి...?

1వ తరగతి పిల్లలకు అక్షరాలు నేర్పే పద్దతి

◆ అక్షరానికి సంబందించిన అభినయ గేయాన్ని 2 సార్లు పాడి వినిపించాలి.

◆ పిల్లల చే పలికి0చాలి.

◆ అక్షరానికి సంబందించిన పాఠ్య పుస్తకం లోని చిత్రాన్ని చూపాలి

◆ చిత్రం గురించి మాట్లాడి0చాలి.

◆ అభినయ గేయాన్ని నల్ల బల్ల ఫై రాయాలి.

◆ నేర్పే అక్షరాన్ని రంగులతో గానీ, పెద్ద సైజు లో గానీ రాయాలి.

◆ గేయం లో మనకు కావలసిన అక్షరం ఎక్కడ ఉందో? గుర్తింపచేయాలి.

◆ కొన్ని పదాలు రాసి మనకు కావలసిన అక్షరం ఎక్కడ వుందో?? చూప మనాలి.

◆ నల్ల బల్ల ఫై అక్షరాన్ని పెద్దగా రాసి చూఇ0చాలి.

◆ ఉచ్చారణ శబ్దం స్పష్టం గా గుర్తించే విధంగా పలికి0చాలి.

◆ అక్షరం రాసే విధానాన్ని నల్ల బల్ల ఫై టీచర్ చూపాలి.

◆ చార్ట్ ఫై అక్షరాన్ని గుర్తించ మనాలి.

◆ చుక్కలు కలపటం, రంగు వేయించటం, రన్నింగ్ బోర్డు ఫై రాయించటం వంటి కృత్యాలు చేయించాలి.

2వ తరగతి తెలుగు ఎలా బోధించాలి?

● 2వ తరగతి లో మనకు 3 రకాల పిల్లలు కనిపిస్తారు.

● అన్నీ వచ్చిన A గ్రూప్ పిల్లలు, B గ్రూప్ పిల్లలు, కొత్త గా చేరి ఏమి రాని పిల్లలు.

● జూన్, జూలై నెలల్లో వర్ణ మాల, గుణింతాలు, మహా ప్రాణ అక్షరాలు పద పద్దతి లో నేర్పాలి.

● తరువాత సరళ పదాలు నేర్పాలి.

● గుణింత పదాలు పద పద్దతి లో నేర్పాలి.

● గుణింత పదాల ఆధారంగా పద జాలం, వాక్యాలను పరిచయం చేయాలి.

● చిన్న చిన్న కధలు, గేయాలు చదివించి రాయించాలి.

● టెస్ట్ బుక్ లోని పాఠాలు చదివించాలి.

● తదుపరి ఒత్తులు పరిచయం చేయాలి.

● ఒక్కో వత్తు కు సంబంధించిన పదాలు చెప్పటం, రాయించటం చేయాలి.

● చివర్లో ఒత్తులు ఉన్న వాక్యాలు చదివించి, రాయించాలి.

● టెస్ట్ బుక్ లోని పాఠాలు చదివించాలి.

అక్షరాలతో గేయాలు

--క్లిక్ తో డౌన్లోడ్


సహజ విలువ-- స్థాన విలువ కాన్సెప్ట్ ఎలా పరిచయం చేయాలి??

ఒక విద్యార్ధిని ని ఇలా ప్రశ్నించ0డి??

● నీ పేరు ఏమిటీ??--అవని

● మీ నాన్నకు ఏమి అవుతావు??--కూతురు

● మీ మామ కు ఏమి అవుతావు??--కోడలు

● మీ తాత కు ఏమి అవుతావు??--మనవరాలు

● మీ బావకు ఏమి అవుతావు??--మరదలు

● మీ స్నేహితురాలు కి ఏమి అవుతావు??--స్నేహితురాలు

● నిన్ను ఎవరు బాగా చూసుకుంటారు??--ఒక్కొక్కరి దగ్గర ఒక్కో విలువ ఉంటుందని గమనిస్ఠా0.

● నీవు ఎవరి దగ్గరకు వెళ్లినా అవని వేనా??--అవని నే.

● లేదా మార్పు ఉంటుందా??--మార్పు ఉండదు.

ఇక్కడ పిల్లలు సహజం గా అవని యే నని, కానీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకంగా కూతురు, కోడలు, మరదలు....ఇలా విలువ పొంద బోతుందని తెలుసుకుంటారు.

అలాగే సంఖ్యలకు కూడా సహజ, స్థాన విలువలు ఉంటాయనే విషయానికి దారి తీయాలి.

No comments:

Post a Comment