July 28, 2023

DEPARTMENTAL TEST OD FACILITY CLARIFICATION

 OD పై వివరణ


FR 9(6) Sub- Rule (b)(iii) ప్రకారం....

తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిన డిపార్టుమెంటల్ టెస్టులకు హాజరయ్యే పీరియడ్ను డ్యూటీగా పరిగణించాలి. దీనికి పరిమితి లేదు. ఎన్నిసార్లయినా డ్యూటీగా పరిగణించాల్సిందే..!

ఐచ్చిక (Optional ) టెస్టులకు మాత్రం కేవలం రెండు సార్లే డ్యూటీగా పరిగణిస్తారు.

రెండుకు మించితే లీవ్ పెట్టుకొని ఈ టెస్టులను రాయాల్సి ఉంటుంది.


టీచర్లకు OD ఇలా...


SGT తత్సమాన కేడర్, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేడర్ టీచర్లు, యాంత్రిక పదోన్నతి స్కేళ్ల మంజూరుకు నాలుగు టెస్టుల్లో  EOT, GOTలు విధిగా పాస్ కావాల్సిందే..! *_కాబట్టి, ఈ రెండు టెస్టులు రాయడానికి అన్ని కేటగిరి ఉపాధ్యాయులకు పరిమితి లేకుండా ఆన్ డ్యూటీ లభిస్తుంది. మిగతా రెండు డిపార్టుమెంటల్ టెస్టులు కంపల్సరియా? కాదా? అనేది ఆయా టీచర్ల విద్యార్హతలపై ఆధారపడి ఉంటుంది. సర్టిఫికెట్స్ చూసి, హైస్కూల్ హెచ్ఎంలు, ఎంఈవోలు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి.

Dep.Tests రాయడానికి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం కల్పించిన OD రాయితీని ఇవ్వడమే న్యాయం. అవగాహన లోపంతో నిరాకరించడం అన్యాయం.


OD CLARIFICATION

MODEL LETTER

No comments:

Post a Comment